ఇంటర్నెట్ లో ఛాట్ ద్వారా పరిచయమైన తను ఎలా ఉంటుందో ఎలాగైనా చూడాలి...అప్పటికి 33 వ సారి అనుకున్నాడు శశి. వెంటనే యాహూ మెసేంజర్ లో లాగిన్ అయి తను ఆన్ లైన్ లో ఉందో లేదోనని గమనించాడు. 'అబ్బా! తను ఆఫ్ లైన్ లో ఉంది. సరే! ఒక సారి ట్రై చేసి చూద్దాం' అనుకుంటూ hello అని మెసేజ్ పంపించాడు. అవతలి నుంచి రిప్లై కోసం టెన్షన్ తో ఎదురు చూస్తున్నాడు. క్షణాలు గడిచే కొద్దీ అతని గుండె వేగం పెరుగుతుంది. 1 నిముషం తర్వాత 'యాహూ' అని గట్టిగా అరిచాడు. తను hi.. అని రిప్లై పంపింది. ఇక నాన్స్టాప్ గా టైప్ చేయడం మొదలు పెట్టాడు.
hi katyayani.. how r u?
i am fine sasi how r u?
fine.
katyayani If u dont mind can i c ur pic
సమాధానం కోసం టెన్షన్ తో వెయిట్ చేస్తున్నాడు శశి
Sorry Sasi. I dont have pic in my computer.
ok. can i know your address plz...
Sasi. we are living at .. Behind of ICICI Bank,Chaitanyapuri, Dilsukh Nagar,
Katyayani.. if u dont mind can i talk to u by fone..
Sasi..Plz dont ask my fone no. I dont want to give my fone no. to chat friends, Sorry.
Katyayani..Dont think so... i wont disturb u by fone..just i am asking as a friend.. if u not intrested to give your fone no. leave it.
కాత్యాయని కొంచెం ఆలోచించింది. తను ఏదో క్యాజువల్ గా అడిగాడు. చూస్తే మంచివాడిలాగే ఉన్నాడు. ఇస్తే తప్పేముంది. వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంది.
O.K. sasi. note my fone no. 9299902579....
తనలోని మాటకారితనంతో ఫోన్ నం. సంపాదించినందుకు మురిసిపోతూ ఫోన్ నం. తన సెల్ లో ఫీడ్ చేస్కున్నాడు.
ThanQ katyayani..
Katyayani as u said, u r MCom Student, so, Whenever i have any doubt in commerce subject can i ask u my doubts?
Certainly Sasi.. you can share with me subject related matters.
ThanQ katyayani...i have to go for study.. can i go..
sure..bye sasi..
bye katyayani.
ఆనందంతో ఉప్పొంగిపోయాడు శశి. తను ఛాట్ లో పరిచయమయ్యి కరెక్ట్ గా వారం రోజులయ్యింది. వారం రోజుల నుండి తన ఫోన్ నం. ఎలా కనుక్కోవాలో అని ఆలోచిస్తున్నాడు. ఈ రోజుకు సాధించాడు. నెక్స్ట్ అతని టార్గెట్: తను ఎలా ఉంటుందో చూడాలి. ఇక రకరకాల ఆలోచనలు చేయడం మొదలు పెట్టాడు. తనతో ఎలా మాట్లాడాలి. ఛాట్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే తను కొంచెం స్ట్రిక్ట్ లాగానే అనిపిస్తుంది. ఏమైనా సరే తనని చూసి తను బాగుంటే లైన్లో పెట్టాలి. ఇదీ శశి ఆలోచన. నిజానికి శశి ఒక పల్లెటూరు నుండి చదువుకోవటానికి వచ్చి వీ.వీ.నగర్ లో ఒక రూమ్ తీస్కొని ఉంటున్నాడు. సిటీకి రావడంతోనే అతని ఒరిజినల్ క్యారెక్టర్ మాయమైపోయింది. అక్కడి స్టైల్స్, తన ఫ్రెండ్స్ వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడటం ఇవన్నీ చూసి శశికి పిచ్చెక్కినట్లయింది. తన ఫ్రెండ్స్ మైన్టైన్ చేసే అమ్మాయిల కంటే అందమైన అమ్మాయిని లైన్లో పెట్టి తన ఫ్రెండ్స్ ముందు తను గ్రేట్ అనిపించుకోవాలి. ఇదీ అతని కాన్సెప్ట్.
ఒక గంట గడిచిన తర్వాత శశి కాత్యాయనికి ఫో్న్ చేశాడు.
"హలో! కాత్యాయని నేను శశిని"
"చెప్పు శశి"
"కాత్యాయని కామర్స్ లో ఒక డౌట్ అడొగొచ్చా.. నువు ఫ్రీగానే ఉన్నావా?"
"పర్వాలేదు శశి అడుగు"
"depreciation అంటే ఏమిటి?"
"శశీ...depreciation అంటే ఆస్తులపై తరుగుదల ఉదా:కు ఒక కంపెనీ ప్రొడక్ట్ తయారు చేయడానికి కావలసిన యంత్రాలను కొనుగోలు చేసిందనుకుందాం. ఆ యంత్రాల ద్వారా ప్రొడక్ట్ ను తయారు చేసే కొద్ది యంత్రం విలువ తగ్గుతుంది కదా. అందుకని కంపెనీ వాళ్లు ప్రతి సంవత్సరం ఆ యంత్రాల మీద తరుగుదల క్రింద 10% గాని లేదా సమ్ పర్సెంట్ మొత్తాన్ని లాభంలో నుంచి పక్కకు తీసి పెడుతారు. ఆ యంత్రాలు ఎప్పుడైనా రిపేర్ వచ్చినపుడు, లేదా ఆ యంత్రాల ప్లేస్ లో కొత్త యంత్రాలు రీప్లేస్ చేయవలసి వచ్చినపుడు ఆ తరుగుదల అమౌంట్ నుపయోగిస్తారు. అర్థం అయిందా?"
"థాంక్యూ! కాత్యాయనీ చాలా వివరంగా చెప్పావు."
"ఓకే శశీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?"
"ఇంకేమీ లేవు. నీ భోజనం అయ్యిందా?"
"ఆఁ ఇప్పుడే అయింది.. శశి నువు భోం చేశావా?"
"లేదు కాత్యాయనీ ఇపుడు చేస్తాను."
"ఏంటి శశీ! ఇంకా భోం చేయలేదా? వెళ్లి ముందు భోం చేయి"
"ఏం చేయమంటావ్! కాత్యాయనీ..నా జీవితంలో అన్నీ కష్టాలే.. వాటి గురించి ఆలోచించి భోజనం కూడా చేయలేకపోతున్నాను"
Saturday, March 7, 2009
తను
Posted by mahigrafix at 9:42 AM
Subscribe to:
Post Comments (Atom)

6 comments:
tested ok
ఇప్పుడే మీ పోస్ట్ చూసాను. టెస్ట్ లానే లేదు. చాలా బాగుంది.
Reality కి చాలా దగ్గర గా వుంది .keeep going.
మీరు పోస్ట్ చేసిన దాని లో ఏమి చెప్పాలనుకొన్నారో అర్ధం అవ లేదు.
సర్,
యాక్చువల్ గా ఇది ఇన్ కంప్లీటెడ్ పోస్ట్. బిజీగా ఉండటం వలన ఇంకా కంప్లీట్ చేయలేకపోయాను. త్వరలోనే తను-2 పోస్ట్ చేస్తాను. ఎక్కువశాతం హీరో స్థానంలో పురుషుడే ఉంటుంటాడు కదా. కొంచెం డిఫరెంట్ గా హీరో స్ఠానంలో స్త్రీని పెట్టి చూపిద్దామనుకుంటున్నాను అందుకోసమే ఈ బ్లాగు పెట్టడం జరిగింది.
హీరో స్దానంలో స్త్రీని పెట్టి చూపించాలి అన్న మీ ఆలోచన అమోగం కొత్తగా ఆలోచించే మీ లాంటి వారి అవసరం ఎంతయినా ఈ సమాజానికి మాకు ఉపయోగకరం
sir, deeniki part 2 twaraga post cheyandi... plzzz
Post a Comment